Wednesday, June 17, 2026
Homeసినిమాసాక్షి వైద్యకి 'గాండీవధారి'తో గట్టి హిట్ పడేనా? 

సాక్షి వైద్యకి ‘గాండీవధారి’తో గట్టి హిట్ పడేనా? 

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త హీరోయిన్స్ పరిచయమయ్యారు. అయితే వాళ్లలో ఒక్క ‘రెబ్బా మోనికా జాన్’ మాత్రమే హిట్ అందుకోగలిగింది. ‘సామజవరగమన’ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకోగలిగింది. ఇక అంతకుముందు వచ్చిన అనిక సురేంద్రన్ .. గౌరీ కిషన్ .. అతుల్య రవి .. ఆషిక రంగనాథ్ వంటి వాళ్లంతా మొదటి సినిమాతో పరాజయాన్ని అందుకోవలసి వచ్చింది. ఇదే జాబితాలో మనకి కనిపించే మరో పేరు సాక్షి వైద్య.

ఫస్టు సినిమా ఫ్లాప్ అయిన తరువాత మిగతా భామలెవరూ మరో ప్రాజెక్టులో కనిపించలేదు. కానీ సాక్షి వైద్య మాత్రం అందుకు మినహాయింపు అన్నట్టుగా కనిపిస్తోంది. అఖిల్ హీరోగా చేసిన ‘ఏజెంట్’ సినిమా ద్వారా సాక్షి వైద్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ పరంగా వంక బెట్టవలసిన అవసరం లేదు .. అలాగే ఆ సినిమాలో ఆమె పాత్ర పరంగా కూడా చెప్పుకోవడానికేమీ లేదు. ఆ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పెద్ద బ్యానర్ .. స్టార్ డైరెక్టర్ .. అయినా కలిసిరాకపోవడంతో, ఈ బ్యూటీ నిరాశపడిపోయింది.

ఇక సాక్షి కూడా రెండో సినిమాకి కనపడకపోవచ్చని కొంతమంది అనుకున్నారు. కానీ ఆమె రెండో ఛాన్స్ అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో .. వరుణ్ తేజ్ జోడీగా ఆమె ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా చేసింది. ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఆమె యాక్షన్ సీన్స్ ను కూడా చేసినట్టుగా అప్ డేట్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా హిట్ కావలసిన అవసరం ఆమెకి ఎంతైనా ఉంది. అలాంటి రిజల్టు కోసమే ఆమె కూడా వెయిట్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular