Saturday, March 14, 2026
HomeTrending Newsమామిడిలో నూతన వంగడం

మామిడిలో నూతన వంగడం

నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ… మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగ గా నామకరణం చేశారు.ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ సి మోహన్ ఆ వంగడాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో ఆవిష్కరింప జేశారు.ఆధునిక పరిజ్ఞానం తో ఫార్మ్ హౌజ్ లకు సరికొత్త డిజైన్ లను రూపొందించే మోహన్… మామిడిలో నూతన వంగడాన్ని సృష్టించడం అద్భుతమైన ప్రయోగంగ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular