Sunday, June 14, 2026
HomeTrending Newsఈడీ ఆఫీస్​కు రాహుల్ గాంధి

ఈడీ ఆఫీస్​కు రాహుల్ గాంధి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్.. సైతం రాహుల్ వెంట ర్యాలీగా వెళ్లారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో సోనియా గాంధీ కూడా విచారణకు రావాల్సి ఉండగా ఆమెకు కరోనా సోకటంతో నిన్న గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు.

కాంగ్రెస్ నేతలను కావాలనే బిజెపి ఇబ్బందుల పాలు చేస్తోందని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీలు చేస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ రోజు ఢిల్లీకి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. రాహుల్ విచారణ ముగిసే వరకు ఈడి కార్యాలయం వద్దే ఆందోళన నిర్వహించాలని వివిధ రాష్ట్రాల పిసిసి నేహ్తలు పిలుపు ఇచ్చారు.

Also Read : సోనియా, రాహుల్ కు ఈడి సమన్లు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular