Sunday, March 15, 2026
Homeసినిమాజూన్ 24న గ్యాంగ్‌స్టర్ గంగరాజు రిలీజ్

జూన్ 24న గ్యాంగ్‌స్టర్ గంగరాజు రిలీజ్

Gangster Coming: రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిద్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్.. ‘వలయం’ సినిమాతో టాలెంట్ నిరూపించుకొని ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ తో బిజీగా ఉన్నారు. ‘చదలవాడ బ్రదర్స్’ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు ధీర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు హీరో లక్ష్.

ఈ చిత్రానికి సాయి కార్తీక్ బాణీలు కట్టగా.. వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular