Friday, September 20, 2024
Homeసినిమావరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ‘గని’ టీజర్

వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ‘గని’ టీజర్

Gani Teaser out: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు.

నేడు జనవరి 19న వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ‌ని మూవీ టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఈ క్యారెక్ట‌ర్ కోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్స్‌ తో కలిసి సినిమాలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలు మరింత పెంచేస్తుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్