Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Womens Ashes: ఏకైక టెస్టులో ఆసీస్ దే గెలుపు

Womens Ashes: ఏకైక టెస్టులో ఆసీస్ దే గెలుపు

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య  మొదలైన యాషెస్ సిరీస్ -2023 లో భాగంగా జరిగిన ఏకైక  మ్యాచ్ ను ఆసీస్ 89 పరుగులతో కైవసం చేసుకుంది. ఆసీస్ బౌలర్ ఆష్లీ గార్డ్ నర్ రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కుప్ప కూల్చింది. రెండో ఇన్నింగ్స్ లోనూ కలిపి 12 వికెట్లు తీసుకొని ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకుంది.

నాటింగ్ హామ్ లోనే ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వేదికగా మొదలైన ఈ టెస్టులో ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లాండ్ కు 257 పరుగుల విజయ లక్ష్యం ఇచ్చింది. నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కు నేడు చివరి రోజు 152 పరుగులు అవసరం కాగా, నిన్నటి స్కోరుకు 62 పరుగులే జత చేసి ఆలౌట్ అయ్యింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ – 473 ఆలౌట్( సుదర్లాండ్-137; ఎలిస్ పెర్రీ-99)
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ – 463 ఆలౌట్ (బీమోంట్-208, నటాలీ స్కివర్ బ్రంట్-78)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 257 ఆలౌట్ (బెత్ మూనీ-85; హేలీ-50; లిచ్ ఫీల్డ్-46)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ – 178 ఆలౌట్ (డ్యానియల్  వ్యాట్- 54)

ఆసీస్ బౌలర్ గార్డ్ నర్-12; ఇంగ్లాండ్ బౌలర్ ఎక్సెల్ స్టోన్ -10 వికెట్లు తీసుకొని సత్తా చాటారు.

సిరీస్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మూడేసి చొప్పున టి 20లు, వన్డేలు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్