Wednesday, March 18, 2026
HomeTrending Newsగవర్నర్ కు మొరపెట్టుకున్న గౌరవెల్లి నిర్వాసితులు

గవర్నర్ కు మొరపెట్టుకున్న గౌరవెల్లి నిర్వాసితులు

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజల ఉసరు పోసుకుంటున్నాడని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మంది పడ్డారు. ప్రాజెక్టు కోసం సర్వస్యం త్యాగం చేసిన వాళ్లపై ఇంత రాక్షసత్వం ప్రదర్శిస్తావా? అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ తీరుపై ధ్వజమెత్తారు. సర్పంచులు, గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలపై బీజేపీ నేతలు గవర్నర్ కు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ నేతలతో కలిసి గవర్నర్ తమిళిసై ని కలిశారు. గవర్నర్ ను కలిసి ఆయా అంశాలపై సర్కార్ తీరును వివరించిన బీజేపీ నేతలు… సమస్యల పరిష్కారానికి కృషి చేయాల‌ని కోరారు.

మహిళల బట్టలు చింపి పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినా స్పందించరా అని సిఎం కెసిఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. తెరాస పాలనలో అప్పులపాలై సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నా సిఎం నోరు మెదపటం లేదని విమర్శించారు. సర్పంచులకు పూర్తి అధికారాలు బదలాయిస్తామన్న హామీ ఏమైందని, వేలమంది బ్రాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

Also Read :  ప్రజల పక్షమే ఉంటాను – తమిళి సై

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular