Friday, March 13, 2026
HomeTrending Newsకొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి

కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి

అమెరికాలోని కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి  చెందగా, మరో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం అర్థరాత్రి 11.57 గంటలకు ఓ సాయుధుడు కాల్పులు జరుపగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ట్రాన్స్‌ఫోబియా కారణంగా హత్యకు గురైన వారి జ్ఞాపకార్థం ఏటా నవంబర్‌ 20న ‘ట్రాన్స్‌జెండర్‌ డే ఆఫ్‌ రిమెంబరెన్స్‌ జరుపుకుంటుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి.

Also Read : మెక్సికో బార్ లో కాల్పులు మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular