ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023 మహిళల డబుల్స్ లో భారత జోడీ గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. సౌత్ కొరియా ద్వయం బీక్ హ న-లీ సో హీ 21-10;21-10 తేడాతో భారత జోడీపై విజయం సాధించారు.
ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ కు చేరకుండానే మిగిలిన ఆటగాళ్లు నిష్క్రమించారు. గాయత్రి-జాలీలు సెమీస్ వరకూ చేరుకొని పతకం సంపాదించారు.