కౌలాలంపూర్ లో నేడు మొదలైన మలేషియా ఓపెన్-2023లో తొలి రౌండ్ లో ఇండియాకు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్- జాలీ జోడీ మాత్రమే విజయం సాధించి రెండో రౌండ్ లోకి ప్రవేశించారు. సింగిల్స్,పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్ళు ఓటమి పాలయ్యారు.
పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ పై 21-19;21-14 తేడాతో జపాన్ ప్లేయర్ నిశిమోటో గెలుపొందాడు.
మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ 12-21; 21-17; 12-21 తో చైనా క్రీడాకారిణి హాన్ యూ; ఆకర్షి కాశ్యప్ పై 21-10; 21-8 తో తైవాన్ ప్లేయర్ వాన్ చి సు గెలుపొందింది.
పురుషుల డబుల్స్ లో సౌత్ కొరియా ఆటగాళ్ళు కాంగ్ మిన్ హయుక్- సియో సియాంగ్ జోడీ21-10; 21-18తో ఇండియా ద్వయం కృష్ణ ప్రసాద్-విష్ణు వర్ధన్ పై విజయం సాధించారు.
మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ- గాయత్రి గోపీచంద్ జోడీ21-19చ 21-14 తేడాతో హాంగ్ కాంగ్ ద్వయం యుంగ్ గా టింగ్- యుంగ్ ప్యు లామ్ పై విజయం సాధించారు.
రేపు హెచ్ ఎస్ ప్రణయ్, పివి సింధు, లక్ష్య సేన్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.