German Open-2022: జర్మన్ ఓపెన్ 2022 టోర్నీలో తొలిరోజు ఇండియాకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్ లో పివి సింధు, సైనా నెహ్వాల్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, ప్రన్నోయ్ అందరూ తొలి రౌండ్ లో విజయకేతనం ఎగురవేయగా, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లో నిరాశ ఎదురైంది,
మహిళల సింగల్స్ లో
పివి సింధు 21-8; 2-7తో థాయ్ లాండ్ క్రీడాకారిణి బుసానన్ ను
సైనా నెహ్వాల్ 21-15; 17-21; 21-14తో స్పెయిన్ కు చెందిన క్లారా అజుర్మెందిని… ఓడించారు
పురుషుల సింగల్స్ లో
కిడాంబి శ్రీకాంత్ 21-10; 13-21; 21-7 తో ఫ్రాన్స్ కు చెందిన బ్రైస్ లేవేర్ డెజ్ పై
లక్ష్య సేన్ 21-6;22-20 తో థాయ్ లాండ్ ఆటగాడు కాంటఫోన్ పై
హెచ్ ఎస్ ప్రన్నోయ్ 21-14;21-19 తో హాంగ్ కాంగ్ ఆటగాడు అంగుస్ లాంగ్ పై విజయం సాధించారు.
మిక్స్డ్ డబుల్స్ లో
సాయి ప్రతీక్-సిక్కీ రెడ్డి జోడీ థాయ్ లాండ్ కు చెందిన ద్వయం చేతిలో 21-19; 21-8తో
ధృవ్ కపిల – గాయత్రీ గోపీచంద్ జోడీ ఇండోనేషియా ఆటగాళ్ళపై 21-19;21-19తో
ఇషాన్ భట్నాగర్- తానీషా ద్వయం ఇంగ్లాండ్ ప్లేయర్ల చేతిలో 21-19; 20-22; 21-9తో
ఎమ్మార్ అర్జున్-త్రీసా జాలీ జంట ఫ్రెంచ్ ఆటగాళ్ళ చేతిలో 21-9;21-18తో ఓటమి పాలయ్యారు.
మహిళల డబుల్స్ లో..
హరిత హరి నారాయణ్, అశ్న రాయ్ లు ఇటలీ జోడీ చేతిలో 21-9;21-10 తో ఓడిపోయారు