ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో ఓడిశాలో నిర్వహించిన పురుషుల హాకీ వరల్డ్ కప్ 2023 టైటిల్ ను జర్మనీ గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్లో బెల్జియంపై 3-3(5-4) తో షూటౌట్ విజయం సాధించి కప్ సొంతం చేసుకుంది.
భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బెల్జియం 10,11 నిమిషాల్లో రెండు ఫీల్డ్ గోల్స్ సాధించి ఆధిక్యంలో నిలిచింది. 29,41, 48 నిమిషాల్లో జెర్మనీ మూడు గోల్స్ చేసి పైచేయి సాధించింది. ఇక విజయం తథ్యం అనుకుంటున్న సమయంలో 59 వ నిమిషంలో బెల్జియం పెనాల్టీ కార్నర్ గోల్ సాధించి స్కోరు సమం చేసింది. ఈ దశలో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది. దీనిలో జెర్మనీ 5-4 తేడాతో విజయం సాధించింది.
మరోవైపు మూడో స్థానం కోసం ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన పోటీలో 3-1తేడాతో నెదర్లాండ్స్ విజయం దక్కించుకుంది.