Friday, March 13, 2026
Homeసినిమాతెలంగాణలో 'గని' టికెట్ రేట్స్ తగ్గింపు

తెలంగాణలో ‘గని’ టికెట్ రేట్స్ తగ్గింపు

Gani- relief:  కరోనా కార‌ణంగా తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఏపీలో టికెట్ రేట్స్ తగ్గించడం ఒక సమస్య అయితే… థియేటర్లలో షోలు తగ్గించడం మరో సమస్య. ఆర్ఆర్ఆర్ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పోసుకుంది. ప్రతి ఏరియాలో రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. అయితే తెలంగాణలో ‘గని’ టికెట్ రేట్స్ తగ్గించాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో రూ. 200 + జీఎస్టీ; సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి రూ. 150 గా నిర్ణయించారు.

టికెట్ రేట్స్ తగ్గించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ‘గని’ సినిమాకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మించారు. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించింది. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో ఈ చిత్రం పై క్యూరియాసిటీ ఏర్ప‌డింది.  ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Also Read : ‘గని’ ప్రీ రిలీజ్ కు అల్లు అర్జున్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular