Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Aha Naa Pellanta: ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పీటలెక్కిన వ్యక్తికి తాళికట్టే సమయంలో పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథతో కామెడీ రొమాన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’.  ZEE 5- తమడ మీడియా భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో రాజ్‌తరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటిస్తున్నారు.

‘ఏబీసీడీ’కి దర్శకత్వం వహించిన సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాహుల్‌ తమడ, సాయిదీప్‌రెడ్డి బుర్ర నిర్మాతలు. ఈ ‘అహ నా పెళ్ళంట’ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోని గరిమెళ్ల  సత్యనారాయణ (ట్రైనింగ్‌ కాలేజ్‌)లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని  భరత్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, చందన నాగేశ్వరావు, కందుల దుర్గేష్‌, ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి  శ్రీధర్‌, ZEE5 నుంచి పూర్ణ ప్రజ్ఞ, రాధకృష్ణవేణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ను రాజమండ్రి, పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకుంటుంది. రాజ్‌తరుణ్‌ తొలిసారిగా వెబ్‌సిరీస్‌లో నటించడం వీటిపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం.ఈ మధ్య కాలంలో అన్ని బాషల్లోని హీరోలు సైతం ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు.మొన్న నటుడు సుశాంత్ మంచి కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్ లో నటించడానికి ముందుకు రాగా..ఇప్పుడు రాజ్ తరుణ్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ లో ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ ఇది. అందరినీ అలరించేలా ఉంటుంది. కామెడీ డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ 30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ ప్రసారం అవుతాయని నిర్మాతలు వెల్లడించారు.

దర్శకుడు సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి… తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించని ఆ పెళ్లి కొడుకు, అందుకు కారణమైన అమ్మాయి – అబ్బాయి పై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆతర్వాత ఏమైంది? అనేది వెబ్ సిరీస్ లో చూడాలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com