Tuesday, June 9, 2026
Homeసినిమా100 మిలియన్ల నిమిషాలతో 'వలీమై' రికార్డ్

100 మిలియన్ల నిమిషాలతో ‘వలీమై’ రికార్డ్

Record Valimai: ZEE5 లో స్ట్రీమింగ్ మొదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది ‘వలిమై’. ఓటిటి ప్లాట్‌ఫామ్స్ లలోనే  ఇప్పటివరకు ఎవరికీ రానటువంటి అతి పెద్ద ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ ఏంటర్ టైనర్ “వలీమై”. “ZEE5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతూ తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులో కి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ.. అభిమానుల సందడితో దూసుకుపోతున్నందుకు ZEE5 టీం ఎంతో సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా, ‘వలీమై సినిమా’ నుండి తొలగించబడిన సీన్స్ ఇప్పుడు ప్రసారం చేస్తున్నారు. అజిత్ కుమార్ IPS ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు.

ZEE5లో  స్ట్రీమింగ్‌ను అవుతున్న సందర్భంగా అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం ZEE5` సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతి పెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లో ఏ ఓటిటి సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. భారతీయ స్ట్రీమింగ్ చరిత్రలో ఇది తిరుగులేని రికార్డు.

“వలీమై మా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకొని విజయవంతంగా రన్ అవుతూ, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది” అని సంతోషం వ్యక్తం చేసింది జీ 5 యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular