Wednesday, September 25, 2024
Homeసినిమానాగార్జున ‘ఘోస్ట్’ లేటెస్ట్ అప్ డేట్

నాగార్జున ‘ఘోస్ట్’ లేటెస్ట్ అప్ డేట్

Ghost Action: టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ‘బంగార్రాజు’తో సక్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. సంక్రాంతికి విడుద‌లైన ఈ  చిత్రం నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల కెరీర్ లో అత్య‌ధిక ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉంటే… నాగార్జున‌ న‌టిస్తున్న తాజా చిత్రం ఘోస్ట్. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బంగార్రాజు సినిమా కంటే ముందుగానే ఘోస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.

అయితే… సంక్రాంతికి బంగార్రాజు సినిమాను విడుద‌ల చేయాల‌నే ఉద్దేశ్యంతో ఘోస్ట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్ ఏంటంటే… దుబాయ్ లో నాగార్జున మ‌రియు కొంత మంది ఫైట‌ర్స్ పై యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఫిబ్ర‌వ‌రి 3 నుంచి దుబాయ్ లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో థాయ్ లాండ్ కి చెందిన ప్ర‌ముఖ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ నుంగ్ నేతృత్వంలో ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇందులో నాగార్జున‌తో పాటు క‌థానాయిక సోనాల్ చౌహాన్ కూడా పాల్గొంటారు. నాగార్జున‌ను స‌రికొత్త‌గా చూపించే ఈ యాక్ష‌న్ మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్