Sunday, January 19, 2025
HomeTrending NewsAP Congress President: పీసీసీ చీఫ్ గా రుద్రరాజు

AP Congress President: పీసీసీ చీఫ్ గా రుద్రరాజు

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును ఏఐసిసి నియమించింది.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఓడిశా రాష్ట్ర కాంగ్రెస్ కో-ఇన్ ఛార్జ్ గా రుద్రరాజు వ్యవహరిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి. రాకేశ్ రెడ్డిలు నియమితులయ్యారు.

పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి ఎం ఎం పల్లం రాజు, ప్రచార కమిటీ ఛైర్మన్ గా మాజీ ఎంపీ జివి హర్ష కుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా డా. ఎన్. తులసి రెడ్డిని పార్టీ నియమించింది.

ప్రస్తుత అధ్యక్షుడు డా. శైలజా నాథ్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమించారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్