Friday, March 29, 2024
Homeసినిమా'HIT 2' పాన్ వైడ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం - అడివి శేష్

‘HIT 2’ పాన్ వైడ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం – అడివి శేష్

అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘హిట్ 2‘. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని స‌మ‌ర్ప‌కుడిగా వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌ పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌. డిసెంబర్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.

అడివి శేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ శైలేష్‌కి, మన అందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్స్ ఈ ట్రైలర్. ఇంత బాగా కట్ చేసిన శైలేష్, గారికి థాంక్స్. హిట్ యూనివర్స్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. ‘హిట్ 3’లోనూ నేను ఉన్నాను. అందుకే శైలేష్‌కు థాంక్స్. ప్యాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని నార్త్ ఆడియెన్స్ అడుగుతుండేవారు. అందుకే నాని గారితో మాట్లాడి.. పాన్ ఇండియన్ రేంజ్‌లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. నాని గారికి, ప్రశాంతి గారికి థాంక్స్. నాతో ఈ సినిమాను నిర్మించినందుకు థాంక్స్. అన్నపూర్ణలో రెండు చిత్రాలు చేయబోతోన్నాను. అవి కూడా పాన్ ఇండియన్ సినిమాలే. క్షణం ట్రైలర్‌ను మహేష్‌ బాబు గారు రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కట్ చేసేందుకు చాలా ఆలోచించాం. ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంటుంది. శ్రీనాథ్ నాకు కాంపిటీషన్ అయ్యేలా ఉన్నారు. మీనాక్షి గారు చక్కగా నటించారు. శ్రద్దా గారు అద్భుతంగా నటించారు.

డిసెంబర్ 2న హిట్ 2 రాబోతోంది. జాన్ ఎడ్డూరి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. శ్రీ చరణ్ పాకాల ట్రైలర్ కోసం పని చేశారు. ఎప్పుడూ ఫైట్లు చేసే నేను డ్యాన్సులు చేశాను. దిశా కేసు సమయంలోనే మొదటి పార్ట్ వచ్చింది. ఇప్పుడు శ్రద్దా వాకర్ కేసు జరుగుతోంది కానీ.. ఇదంతా యాదృశ్చికంగానే జరిగింది. మేజర్‌లో చేసిన పాత్రకు హిట్ 2లో చేసిన పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఈ పాత్ర కోసం నేనేమీ రీసెర్చ్ చేయలేదు. స్క్రిప్టే రీసెర్చ్ చేసినట్టు ఉంది. సినిమాను హిందీలో రిలీజ్ చేయండని ఆడియెన్స్ అడుగుతుండటంతోనే మాకు కూడా ఆలోచన వచ్చింది. హిందీ వర్షన్‌లో కాస్త ఆలస్యంగా విడుదలవుతుంది. ఇక్కడ ఉండే ఇండియన్ సినిమాను చేస్తాను. కథ, డైరెక్టర్, నాని ఇలా అందరి కోసం ఈ సినిమాను చేశాను. ఓ ఆడియెన్‌లా కథలో దర్శకుడికి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చాను. పాన్ ఇండియన్ అనేది కథలో ఉండాలి.  ఇమేజ్ ఉంది కదా? అని పాన్ ఇండియన్ చేయకూడదు అని అన్నారు.

Also Read : ‘హిట్ 2’ నుంచి ‘ఉరికే ఉరికే’ సాంగ్ ప్రోమో రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్