Friday, June 12, 2026
Homeసినిమా'ధమాకా' నుండి 'డు డు సాంగ్' ప్రోమో రిలీజ్

‘ధమాకా’ నుండి ‘డు డు సాంగ్’ ప్రోమో రిలీజ్

రవితేజ, త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా‘. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ‘డు డు సాంగ్’ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇటివలే ప్రకటించిన టీం తాజాగా ప్రోమోని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో మరో డ్యాన్సింగ్ నెంబర్ గా డు డు పాటని కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతోంది.

ప్రోమోలో రవితేజ చేసిన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్ పాట పై అంచనాలని పెంచింది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, పృధ్వీ చంద్ర ఆలపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాల పై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

Also Read:26 మిలియన్ వ్యూస్ దాటిన ధమాకా జింతాక్ సాంగ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular