పాకిస్థాన్‌లోని గిల్గిట్-బాల్టిస్థాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. శోన్తర్ కనుమల్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 11 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. రెస్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కొందరు పశువులతో సహా కొండ ప్రాంతం నుంచి ప్రయాణిస్తుండగా అస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
pakistan ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఖనిజ సంపద కొల్లగొడుతూ… గనులు వాడుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం పట్టించుకోవటం లేదు. గిల్గిత్ రాష్ట్రంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. చైనాకు కాంట్రాక్టులు అప్పగించిన పాక్ పాలకులు అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు భారత్ లో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.