Friday, June 12, 2026
Homeసినిమావరుణ్ ధావన్ ‘భేదియా’ వీడియో సాంగ్ రిలీజ్

వరుణ్ ధావన్ ‘భేదియా’ వీడియో సాంగ్ రిలీజ్

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ రీసెంట్ గా ‘కాంతార’తో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న ‘భేదియా’ చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్దమవుతోంది. ఈ చిత్రం నుండి ‘తుమ్కేశ్వరి’ అనే మొదటి పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటకు విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. కార్తీక్ ఆలపించిన ఈ సాంగ్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది

భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అమితాబ్ భట్టాచార్య & యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు.  భేదియా చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “భేదియా” తెలుగులో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular