Tuesday, June 16, 2026
Homeసినిమాఅంచనాలు పెంచేసిన 'టైగర్ నాగేశ్వరరావు' గ్లింప్స్

అంచనాలు పెంచేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ గ్లింప్స్

రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’.  వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగర్ దండయాత్ర (Tiger’s Invasion) టీజర్ ఇప్పుడు విడుదలైంది. హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, దేశంలోని అనేక ప్రాంతాలలో దొంగతనాలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు మద్రాస్ సెంట్రల్ జైలు నుండి పరారీలో ఉన్నారనే వార్తా కథనంతో టీజర్  ప్రారంభమవుతుంది. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో పోలీసులు షాక్‌ అవుతారు. టైగర్‌ జోన్‌లో పని చేసిన మురళీ శర్మ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా టైగర్ నాగేశ్వరరావులోని అరుదైన నైపుణ్యాల గురించి వివరిస్తారు.

నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి  మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తు, వాడొక క్రిమినల్ అయ్యాడు” అని మురళీ శర్మ టైగర్ నాగేశ్వరరావు సామర్థ్యాలను వివరిస్తారు.

టైగర్ నాగేశ్వరరావు చిన్నతనంలోనే నేరాలు చేయడం ప్రారంభించడంతో చిన్నప్పటి నుంచి వైల్డ్  స్వభావం కలిగి ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు , ఆర్మీ బెటాలియన్‌ను మోహరించారు, అలాంటి భయం అతను ప్రజలు,  ప్రభుత్వంలో కలిగించాడు.

లాస్ట్ పోర్షన్  వరకు అతని ముఖాన్నిచూపించకపోయినా, టీజర్ అంతా అతని ప్రజన్స్ అనుభూతి చెందుతాం. టైగర్ ఎంట్రీ కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. రైలు ఎపిసోడ్ పాత్ర యొక్క ధైర్యాన్ని చూపిస్తుంది. ఇందులో రవితేజను చూసిన తర్వాత టైటిల్ రోల్‌లో మరే ఇతర స్టార్‌ను మనం ఊహించుకోలేము. ట్రాన్స్ ఫార్మేషన్ చెందడం నుంచి, పాత్రను పోషించడం వరకు రవితేజ ఎక్స్ టార్డినరిగా చేశారు. తన వైల్డ్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. దర్శకుడు వంశీ బ్రిలియంట్ రైటింగ్, అద్భుతమైన దర్శకత్వాన్ని అభినందించాలి. డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్. ఈ గ్లింప్స్ ఇప్పటి వరకు సినిమా పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular