Friday, March 20, 2026
Homeసినిమా'గాడ్ ఫాదర్' కు యూ/ఎ సర్టిఫికేట్

‘గాడ్ ఫాదర్’ కు యూ/ఎ సర్టిఫికేట్

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్‘ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్నఈ సినిమా తాజా గాసెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

‘గాడ్ ఫాదర్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. థార్ మార్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌ల పై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read : ‘గాడ్ ఫాదర్’ కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular