Sunday, June 14, 2026
Homeసినిమా'గాడ్ ఫాదర్' ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాట విడుదల

‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాట విడుదల

‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి జాతర సృష్టించిన ‘థార్ మార్’ సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌ పై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇద్దరూ తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇది విజువల్ ట్రీట్‌గా వుంది.

చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్‌ మళ్ళీమళ్ళీ వినాలనిపించేలా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ వీడియోలో చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, సల్మాన్ తన గోళ్లు కొరుకుతూ మాస్ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేసి ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌కు అదనపు ఆకర్షణ జోడించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకుంది.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read: గాడ్ ఫాదర్ సాంగ్ ప్రోమో విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular