Thursday, March 19, 2026
HomeTrending NewsGoddess Durgamma: నేటినుంచి శాకాంబరి ఉత్సవాలు

Goddess Durgamma: నేటినుంచి శాకాంబరి ఉత్సవాలు

ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమివ్వనున్నారు.

మొదటి రెండ్రోజులు కాయగూరలతో అమ్మవారిని అలంకరిస్తారు.  మూడోరోజు డ్రై ఫ్రూట్స్ తో అమ్మవారికి అలంకరణ గావిస్తారు.  అదే రోజు భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితి వారు బెజవాడ దుర్గమ్మకు బోనం సమర్పించనున్నారు.

అమ్మవారి శాకాంబరి దేవి మహోత్సవాల్లో భాగంగా నేడు  మహామండపం 6వ అంతస్తు నందు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించి, ఉత్సవ ఏర్పాట్ల పనులను ప్రారంభించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular