Tuesday, April 16, 2024
Homeసినిమా'జిన్నా' నుంచి 'గోలీ సోడా వే' సాంగ్ రిలీజ్

‘జిన్నా’ నుంచి ‘గోలీ సోడా వే’ సాంగ్ రిలీజ్

మంచు విష్ణు తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోన వెంకట్ స్క్రిప్టుతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీ నుండి విడుదలైన పెప్పీ డ్యాన్స్ నంబర్ ‘గోలీ సోడా వే’ పాట అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటలో విష్ణు, పాయల్ రాజ్‌పుత్ ఉన్నారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన సంగీత సారద్యంలో నకాష్ అజీజ్,  నూతన మోహన్ లు ఈ పాటను పాడారు.

షూటింగ్ సమయంలో కాలుకు గాయమైనప్పటికీ, అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేయడంతో హీరో విష్ణు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా మంచులు ఈ చిత్రంతో తొలిసారిగా గాయకులుగా పరిచయమవుతున్నారు. స్నేహం మీద సాగే ఫ్రెండ్‌షిప్ సాంగ్ ఇప్పటికీ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. సైకాలజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో నటించారు.

Also Read: జిన్నా మాంఛి ఊపుమీదే ఉన్నాడే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్