Thursday, March 12, 2026
Homeసినిమాఫిబ్రవరి 18న ‘2020 గోల్ మాల్’ విడుద‌ల‌

ఫిబ్రవరి 18న ‘2020 గోల్ మాల్’ విడుద‌ల‌

Golmal: మిట్టకంటి రామ్, విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత, మహి మల్హోత్రా, కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా రూపొందిన‌ కొత్త చిత్రం ‘2020 గోల్ మాల్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘అమృతారామమ్’ తర్వాత రామ్, “దేవరకొండలో విజయ ప్రేమకథ”, “కపటనాటక సూత్రధారి” తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న ‘2020 గోల్ మాల్’ పై అంచనాలు బాగానే ఉన్నాయి.

కె.కె. చైతన్య సమర్పిస్తున్న ఈ మూవీని బాబీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నిర్మించింది నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించారు. పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఫిబ్ర‌వ‌రి 18న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. ఈ సినిమాలోని ‘ఇంతలో ఎన్నిని వింతలో’ పాట ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి సింగర్ జావీద్ అలీ, సుకుమారి, అర్మాన్ మాలిక్ పాడిన పాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.

డైరెక్టర్ జాన్ మాట్లాడుతూ “ఈ సినిమా ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో రామ్, విజయ మిగిలిన నటులు రెట్రోలుక్ లో కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మనం గతంలో కోల్పోయిన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ. ఇది ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ కామెడీ డ్రామా , ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం. రిట్రో మిక్స్ అయినా చిత్రం ఫిబ్ర‌వ‌రి 18న థియేటర్లలో కలుసుకుందాం” అన్నారు.

Also Read : ‘డేగల బాబ్జీ’ లోని ‘కలలే కన్నానే’ లిరికల్ వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular