Wednesday, May 8, 2024
Homeసినిమా'డేగల బాబ్జీ' లోని 'కలలే కన్నానే' లిరికల్ వీడియో

‘డేగల బాబ్జీ’ లోని ‘కలలే కన్నానే’ లిరికల్ వీడియో

Degala Babji: ఒక వ్యక్తి, ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, సినిమా అంతా కనిపిస్తాడు. తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నప్ప‌టికీ… వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన “ఉత్త సిరుప్పు సైజు 7”  చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసున్న చిత్రమే ‘డేగల బాబ్జీ’.

వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకం పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ట్రైలర్ సైతం ప్రేక్షకులనుండి ఎంతో ఆధరణ లభించింది. ఇప్పుడు ఈ చిత్రంలోని లిరికల్ వీడియోను బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి విడుదల చేసారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ “మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి, హరీష్ శంకర్  గారికి ధన్యవాదాలు. తమిళ్ లో పార్థీబన్ చేసిన “ఉత్త సిరుప్పు సైజు  7” నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాను తీసుకున్నాను అని నా మిత్రుడు వెంకట్ చంద్ర చెప్పడం జరిగింది. తనతో నాకు 20 సంవత్సరాల స్నేహం. తెలుగులో స్టార్ హీరోలు ఎవరు చేసినా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది అనుకున్నాను. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో నన్ను నటించమని చెపితే..నేను యాక్ట్ చేయడమేమిటి.. నేను యాక్టింగ్ మర్చిపోయాను. తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసిన తను ఎక్కడ.. నేనెక్కడ నేను చేయలేను.. అయినా  నేనిప్పుడు సినిమా తీద్దామనుకుంటున్నాను యాక్ట్ చేయనని చెప్పాను. అయితే.. కథ చాలా బాగుందని చెబుతూ నన్ను కన్విన్స్ చేయడంతో.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” సినిమా తీసినప్పుడు ఎంత హాయిగా   కాలరెగరేసి తృప్తిగా ఉన్నానో.. నేను చచ్చిపోయిన తరువాత కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే గర్వం ఎలా ఉంటుందో. ఈ “డేగల బాబ్జి” చిత్రం కూడా నాకు అంత తృప్తినిచ్చింది. నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా ఇది. ఇది భవిష్యత్తులో నేను యాక్ట్ చేస్తానో లేదో తెలియదు కానీ.. ఈ సినిమా ద్వారా నా జన్మ ధన్యమైంది అని అనుకుంటున్నాను” అన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్