Thursday, March 28, 2024
Homeసినిమాకొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ‘సెబాస్టియన్-పి.సి.524’

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ‘సెబాస్టియన్-పి.సి.524’

Sebastian: కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘సెబాస్టియన్” PC 524’. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై  సిద్దారెడ్డి  నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రమోద్, రాజు, జయచంద్రా రెడ్డి, కె ఎల్ మదన్  లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25 న విడుదల కానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ “ఇంతకు ముందు  గీతా ఆర్ట్స్, యు వి క్రియేషన్స్ లో అసోసియేట్ గా వుంటూ టాక్సీవాలా, ద్వారక సినిమాలకి పని చేశాను. ఆతర్వాత నేను ఒక కొత్త కథ రాసుకొని చాలా మందికి చెప్పడం జరిగింది. అయితే నా కామన్ ఫ్రెండ్ ద్వారా కిరణ్ ను కలసి కథ చెప్పను. ‘సెబాస్టియన్’ అను కానిస్టేబుల్ ను తనకున్న నైట్ బ్లైండ్నెస్ ద్వారా తను ఏం ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథను చెప్పిన వెంటనే సినిమా చేద్దామన్నాడు. మదనపల్లె రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేయడం నాకు కొత్తగా అనిపించింది. 32 రోజుల్లో ఏకధాటిగా షూటింగ్ చేసి పూర్తి చేసుకున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది, ఈ నెల 25న విడుదల అవుతుంది” అన్నారు.

హీరో కిరణ్ ఆబ్బవరం మాట్లాడుతూ “రాజావారు రాణిగారు అయిపోయిన తర్వాత  బాలాజీ గారు “యస్ ఆర్. కళ్యాణమండపం” షూట్ లోకలవడం జరిగింది. సెబా అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని ఈ కథను 15 నిమిషాలు వినగానే నచ్చి ఈ కథ చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాను తెలుగు, తమిళ్ లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సెబాస్టియన్ అనే క్యారెక్టర్ చాలా మందికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. చంటి సినిమాలో బ్రహ్మానందం గారు 15 నిమిషాలు రేచీకటి క్యారెక్టర్ చేస్తేనే అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. అలాంటిది ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఈ క్యారెక్టర్ ను చాలెంజ్ గా తీసుకుని చేస్తున్నాను. సెబాస్టియన్ సినిమా ప్రేక్షకులను 100% ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా కోసం మేమంతా ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోందని చాలా ఎగ్జైటింగ్ గా  ఎదురు చూస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి క్యారెక్టర్  నాకు ఇంత తొందరగా దొరకడం నా అదృష్టం. హీరోయిన్ నమ్రత, కోమలి ,పాటు 24 క్రాఫ్ట్డ్ అందరూ చాలా కష్టపడి చేశారు.ఫిబ్రవరి 5 న  టీజర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అన్నారు.

Also Read : ఫిబ్రవరి 7న ‘ఎఫ్ 3’ ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’

RELATED ARTICLES

Most Popular

న్యూస్