బిజెపి, ఆర్ ఎస్ ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయని, బిజెపి ఆర్ ఎస్ ఎస్ నుండి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. అచ్ఛా ద్దీన్ ఎప్పుడొస్తాయని ప్రజలు అడుగుతున్నారని ప్రధానమంత్రిని ప్రశ్నించారు. అంబానీ, ఆదానీలకు మాత్రమే మంచి రోజులు వచ్చాయి…సామాన్య ప్రజలకు రాలేదన్నారు. మోడీ పాలసీలు అన్నీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయని, బిజెపి దేశాన్ని దోచుకుంటోందని ధ్వజమెత్తారు. మోడీ పాలసీలను, మోడి పాలన తీరును వ్యతిరేకిస్తే జైల్లో పెడుతున్నారని డి రాజా ఢిల్లీలో ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని చూసి….చేసేది లేక మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని, మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుండాలని సిపిఐ నేత పిలుపు ఇచ్చారు.
Also Read : వనమా రాఘవ సస్పెన్షన్