Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Good Luck Sakhi Release Postponed :

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నకీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

ఈ మేరకు నిర్మాత సుధీర్ చంద్ర ఓ ప్రకటన చేశారు. ‘పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరినీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నామ’ని అన్నారు.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి.

Also Read :  థియేటర్ లోనే ‘గుడ్ లక్’ : నిర్మాత క్లారిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com