Saturday, January 18, 2025
Homeసినిమాగోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్

గోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్

హీరో గోపీచంద్ కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ‘లక్ష్యం’ ఒకటి. శ్రీవాస్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కమర్షియల్ సక్సస్ సాధించింది. ఆతర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా ‘లౌక్యం’. ఇది కూడా సక్సస్ అయ్యింది. ఇప్పుడు గోపీచంద్, శ్రీవాస్ ల క్రేజీ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది గోపీచంద్ 30వ చిత్రం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నాం అని నిర్మాణ సంస్థ తెలియచేసింది. ఇక గోపీచంద్ నటించిన సీటీమార్ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈమధ్య గోపీచంద్ కెరీర్ లో కాస్త వెనకబడ్డాడు. మరి.. సీటీమార్, మారుతి, శ్రీవాస్ లతో చేయనున్న సినిమాలతో విజయం అందుకుని మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్