Tuesday, April 16, 2024
HomeTrending Newsమాండూస్ బాధితులను ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

మాండూస్ బాధితులను ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

మాండూస్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను వెంటనే క్షేత్ర స్థాయికి పంపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.  గతంలో కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 64 మంది చనిపోయి వేలాది ఇళ్లు, వందలాది ఎకరాల్లో పంట నాశనమైతే వారికి ఇప్పటి వరకూ నష్ట పరిహారం అందించలేకపోయారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అచ్చెన్నాయుడు ప్రకటనలో ముఖ్యాంశాలు:

  • తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
  • కోత కోసిన పంట వర్షాలకు తడిచి పాడైపోయింది.
  • చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా పాడయ్యాయి.
  • ఇప్పటికే కళ్లాల్లో ఉన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించడం వల్ల వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
  • కానీ ముఖ్యమంత్రి మాత్రం రైతుల సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేయడం దుర్మార్గం.
  • రైతులు పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ప్రభుత్వం రైతుల సంక్షేమంపై దృష్టిసారించాలి.
  • ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అందించి రైతులను ఆదుకోవాలి.
  • వర్షం నీటిలో పంట కొట్టుకుపోయిన ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందించాలి.
  • ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో నడిరోడ్డున పడిన అన్నమయ్య డ్యాం బాధిత కుటుంబాలకు నిలువనీడ ఆశ్రయం కల్పించలేదు.
  • రైతులకు పంట నష్టాన్ని భర్తీ చేయలేదు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
  • వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
  • ఫలితంగా రైతులు గత నాలుగేళ్లుగా నష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గతేడాది, ఈ సంవత్సరం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.
  • లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్