Monday, January 20, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అశోక్ గజపతిది ఓర్వలేని తనం: వెల్లంపల్లి

అశోక్ గజపతిది ఓర్వలేని తనం: వెల్లంపల్లి

మాన్సాస్ ట్రస్టుకు సొంత అన్న కూతురు సంచయిత ఛైర్మన్ అయితే తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు ఓర్వలేకపోయారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఇన్నేళ్ళు చైర్మన్ గా ఉంది అశోక్ గజపతి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదవులు చేపట్టడం ముఖ్యం కాదని, అభివృద్ధి ముఖ్యమని వ్యాఖానించారు.

ట్రస్టు వ్యవహారాలపై కోర్టు తీర్పు కాపీ అందిన తరువాత ఏమి చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తున్నామని, దేవాలయ భూములపై విచారణ జరుగుతుందని మంత్రి వివరించారు. బొబ్బిలి రాజులు ప్రభుత్వంతో ఏదైనా చర్చిన్చాలనుకుంటే ఆహ్వానిస్తామన్నారు వెల్లంపల్లి. గతంలో దేవాలయ భూములను చంద్రబాబు పప్పు బెల్లాలు పంచినట్లు తన అనుయాయులకు దోచి పెట్టారని మంత్రి విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్