Tuesday, January 21, 2025
HomeTrending Newsమృతుల కుటుంబాలకు 2 లక్ష పరిహారం: సిఎం

మృతుల కుటుంబాలకు 2 లక్ష పరిహారం: సిఎం

నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కందుకూరు ఘటనపై ఆరా తీశారు.   ఈ  ఘటనపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున , గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగానిలుస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్