చైనాలో కరోన కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు… చైనా మీదుగా వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. స్వదేశీ, విదేశీయులపై చైనా ఆంక్షలను సడలించగా.. అక్కడి నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే భారత్, జపాన్‌, మలేషియాలు‌.. డ్రాగన్‌ దేశం నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరింది. చైనా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ చూపించాలని నిబంధన పెట్టింది. పుట్టినింట్లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి.

ప్రయాణానికి రెండు రోజుల ముందు ఆర్ టి పీసీఆర్‌ టెస్ట్‌ చేసుకోవాలని, నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉండాలని అధికారులు స్పష్టంచేశారు. అదేవిధంగా చైనా నుంచి నేరుగా కాకుండా సియోల్‌, టొరంటో, వాంకోవర్‌ మీదుగా వచ్చే ప్రయాణికులకు కూడా ఇదే షరతు వర్తిస్తుందని వెల్లడించారు. వచ్చే నెల 5 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *