Friday, March 20, 2026
Homeసినిమా'ఏమాయ చేసావే' సీక్వెల్ వస్తుందా?

‘ఏమాయ చేసావే’ సీక్వెల్ వస్తుందా?

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏమాయ చేశావే’.గౌతమ్ మీనన్ దర్శకత్వంలో  విభిన్న ప్రేమకథా చిత్రంగా విడుదలై అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. నాగచైతన్య, సమంత కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే.. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమకథల గురించి చెప్పాలంటే… ఏమాయ చేశావే కూడా ముందు వరుసలో ఉంటుంది. ఇక చైతన్య, సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా టైమ్ లోనే ఇద్దరూ ఫ్రెండ్స్ అవ్వడం.. ఆతర్వాత లవర్స్ అవ్వడం.. మ్యారేజ్ చేసుకోవడం జరిగింది.

అయితే.. ఓ రోజు సడన్ గా వీరిద్దరూ విడిపోతున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సర్ధి చెప్పినా వారు విడిపోవాలని నిర్ణయించుకుని డివైడ్ అయ్యారని వార్తలు వచ్చాయి. డైవర్స్ తీసుకుని ఇప్పుడు ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే.. ఈ టైం లో ఏమాయ చేసావె సీక్వెల్ గా ఏ మాయ చేసావే 2 టైటిల్ తో  గౌతమ్ మీనన్ ఒక కథ అనుకున్నారట. ఆ సినిమాని చైతన్యతో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఏమాయ చేసావె 2 చేస్తే చైతు సమంత ఇద్దరు కలిసి నటించాలి కానీ వారిద్దరు కలిసి నటించే ఛాన్స్ లేదు.

అందుకే సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని ఫిక్స్ చేశారట. ఆమె ఎవరో కాదు క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్య సమంతల మధ్య పెళ్లి తర్వాత జరిగిన సంఘటనల గురించి రీల్ లైఫ్ లో చూపించబోతున్నారట. అయితే.. స్క్రీన్ మీద సమంత బదులుగా రష్మిక కనిపిస్తుందని టాక్.  నిజంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. ఇందులో నాగ చైతన్య రష్మిక ఇద్దరు కలిసి నటిస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: నాగచైతన్య కోరిక ఈసారైనా తీరుతుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular