Saturday, January 18, 2025
Homeసినిమాచైతు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి మ‌హేష్ నో చెప్పారా..?

చైతు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి మ‌హేష్ నో చెప్పారా..?

ఒక హీరో కోసం క‌థ రాస్తే.. అది మ‌రో హీరోతో సెట్ అవుతుంటుంది. ఇండ‌స్ట్రీలో ఇది కామ‌న్. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కోసం క‌థ రాస్తే.. ఆ క‌థ నాగ‌చైత‌న్య‌కు ద‌గ్గ‌ర‌కు వెళ్లి బ్లాక్ బస్ట‌ర్ గా నిలిచింది. అదే ‘ఏమాయ చేశావే’. అవును ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఏమాయ చేశావే డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ చెప్పారు. ఆయ‌న త‌మిళ ద‌ర్శ‌కుడు అయిన‌ప్ప‌టికీ.. మ‌న హీరోల‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం.

ఇప్పుడు గౌత‌మ్ మీన‌న్.. ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శింబుతో తెర‌కెక్కించిన ‘ముత్తు’ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన గౌత‌మ్ ఈ విషయాన్ని వెల్లడించారు.  మహేష్‌ కి లవ్‌ స్టోరీ చెప్పినప్పుడు మనం కలిస్తే.. ఓ మంచి యాక్షన్‌ సినిమా రావాలని, అలాంటి కథ ఉంటే చెప్పమని అడిగారని గౌతమ్ చెప్పారు.

రామ్‌ చరణ్‌ తోనూ గౌతమ్‌ ఓ సినిమా చేయాలనుకున్నారు. అది కూడా చర్చల దశలోనే ఆగిపోయింది. అయితే.. ఇప్పటికీ  చరణ్‌తో టచ్‌లోనే ఉన్నానని చెప్పారు గౌతమ్‌ మీనన్‌.  సో… చ‌ర‌ణ్‌, మహేష్ లతో గౌత‌మ్ సినిమాలు ఎప్ప‌టికీ సెట్ అవుతాయో చూడాలి.

Also Read: మ‌హేష్, జ‌క్క‌న్న‌ మూవీ టార్గెట్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్