ఎంబీబీఎస్ అడ్మిషన్లు, పరీక్షలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే నిర్ధిష్టమైన క్యాలెండర్‌ను రూపొందిస్తూ ‘నేషనల్ మెడికల్ కమిషన్’ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు1న ప్రారంభించి, ఆగస్టు 30న ముగించాలని రాష్ర్టాలకు సూచించింది.
ఇక నుంచి సప్లిమెంటరీ బ్యాచ్‌లు ఉండవని, 2024 నుంచి కామన్ కౌన్సెలింగ్ ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. ‘గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023’ పేరుతో రూపొందించిన మార్గదర్శకాలు వచ్చే ఏడాది అమల్లోకి రాబోతున్నట్టు ఎన్‌ఎంసీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.