Tuesday, March 17, 2026
HomeTrending Newsసిఎంను కలిసిన సచివాలయాల ఉద్యోగులు

సిఎంను కలిసిన సచివాలయాల ఉద్యోగులు

Thanks: ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ను డిక్లేర్‌ చేయడం పట్ల  ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ విప్పర్తి నిఖిల్‌కృష్ణ, భార్గవ్‌ సుతేజ్, అదనపు ప్రధాన కార్యదర్శి బిఆర్‌ఆర్‌.కిశోర్, తదితరులు సిఎం ను కలుసుకున్నారు.  వీరితో పాటు హాజరైన ముఖ్యమంత్రి సలహాదారు (గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన కార్యక్రమం) ఆర్‌. ధనంజయ రెడ్డి కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular