Thursday, March 19, 2026
HomeTrending NewsVajrotsavam: వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Vajrotsavam: వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి నేడు ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తో పాటు పీసీసీఎఫ్ డోబ్రియల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, హ్యాండ్లూమ్స్ శాఖ కమీషనర్ బుద్ధ ప్రకాష్, సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి అశోక్ రెడ్డి, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, ఆయుష్ శాఖ కమీషనర్ హరి చందన, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తదితరులు న ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ముగింపు వెడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు చెందిన ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్టు వెల్లడించారు. ముగింపు వేడుకల తేదీలను ముఖ్యమంత్రి త్వరలో ఖరారు చేస్తారన్నారు. ప్రధానంగా, భారత వజ్రోత్సవ ప్లాంటేషన్ పేరుతొ ఒక కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దారించారని, ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జండాలను పంపిణీ చేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని సినిమాహాళ్లలో గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నామని వివరించారు. వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రిక కట్టడాలను, జంక్షన్లను విధ్యుత్ దీపాలతో అలకంకరించనున్నామని తెలిపారు.


స్వతంత్ర భారత వజ్రోత్సవాల విషయంపై రాష్ట్రంలోని విద్యాసంస్థలలో వ్యాసరచన, వకృత్వ, పెయింటింగ్ తదితర కాంపిటీషన్లను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.5 కె, 2 కె రన్ లను చేపడతామని అన్నారు. భారత స్వతంత్ర స్ఫూర్తిని తెలియచేసే విధంగా అన్ని పాఠశాలల్లో స్వతంత్ర భేరిని నిర్వహించడంతోపాటు స్వాత్రంత్ర పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమాన్ని తెలియచేసే ఫోటో ప్రదర్శనను హైదరాబాద్ లో నిర్వహించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమాలకు నిర్వహణ సంబందించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి ఖరారు చేస్తారని సి.ఎస్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular