Saturday, November 23, 2024
HomeTrending NewsYSRCP: జైత్రయాత్రలా సాగుతోన్న సామాజిక బస్సు యాత్ర

YSRCP: జైత్రయాత్రలా సాగుతోన్న సామాజిక బస్సు యాత్ర

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు అనేక మంది నాయకుల ఉపన్యాసాల్లోనే సామాజిక సాధికారత మాట విన్నామని, జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సామాజిక సాధికారత అమలు కావడం కళ్ళారా చూస్తున్నామని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. అంబేద్కర్‌ కలలు సాకారం చేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన సాగిస్తున్నారని… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకొనేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ వర్గం నుంచి తాను, గౌడ వర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, యాదవ వర్గం నుంచి బీద మస్తాన్‌రావు, కురుబ వర్గంనుంచి ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభలో అడుగుపెట్టే అరుదైన అవకాశం కల్పించారని వివరించారు. కృష్ణాజిల్లా పామర్రులో సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రజల హర్షధ్వానాల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్‌ కుమార్, కొలుసు పార్థసారథి, ముస్తఫా, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ హారిక తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్‌ మాట్లాడిన ముఖ్యాంశాలు:

⦿ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలపై వివక్ష చూపిన చంద్రబాబు.
⦿ జగనన్నకు పేదవాడి కష్టం తెలుసు. చమట వాసన తెలుసు.
⦿ ఆయనకు కావాల్సింది అట్టడుగున ఉన్న ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీల్లోని పేదవారి అభ్యున్నతి
⦿ ఒక సామాజిక వర్గంలో కొంతమందికి రాష్ట్ర సంపదను దోచిపెట్టిన చంద్రబాబు.
⦿ రాజధానిలో లక్షల కోట్ల సంపద దోచి సింగపూర్, మలేషియాలో దాచాడు.
⦿ చంద్రబాబు ఆస్తి రెండెకరాలే. 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడంటే ఎలా సాధ్యమైంది.
⦿ జగనన్న వచ్చిన తర్వాత మన సంపదను పిల్లలు చదువుకోడానికి ఇంగ్లీషు మీడియం తెచ్చారు.
⦿ రైతుభరోసా మొదలు పేదవాడికి మేలు జరిగే ప్రతి పథకాన్నీ ఇస్తూ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు.
⦿ జగనన్న ఇడుపులపాయకు తీసుకెళ్లి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఎంపీల లిస్టు చదివించారు.
⦿ రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
⦿ పదో తరగతి చదివిన వ్యక్తికి గ్రీన్‌ ఇంక్‌తో సంతకం చేసేలా నాకు అవకాశం ఇచ్చారు.
⦿ రూ.371 కోట్లు దోచుకుతిని జైలుకెళ్లిన చంద్రబాబు. నిజం గెలిస్తే చంద్రబాబు శేష జీవితం అంతా జైల్లో గడపాల్సిందే.
⦿ సామాన్యుడు, పేద కూలీ కొడుకును తెచ్చి ఎంపీని చేసిన జగనన్న.
⦿ విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం తాడేపల్లివైపు చూపుతుంటుంది.
⦿ నా ఆశయాలు నెరవేర్చే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని జగనన్నవైపు చూపుతుంటుంది.

అనకాపల్లిలో….

రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో హామీలన్నింటినీ అమలు చేసి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి జగన్ కృషి చేశారన్నారు. రూ. 830 కోట్ల రూపాయలు అనకాపల్లి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేశామని, మహాత్మాగాంధీ ఆశయాలను తన పాలన ద్వారా సాకాలం చేసిన ఘనత సీఎం జగన్ ది మాత్రమేనని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైెస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయయాత్రగా కొనసాగుతోంది. అనకాపల్లి నియోజకవర్గం మారేడుపూడి వద్ద ప్రజలు మంగళ హారతులు, హర్షధ్వానాల సాగింది. ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్నదొర, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

కావలిలో…..

ఒక్క జగనన్న ఫొటో పెట్టుకుని మాత్రమే వచ్చినా… వేలాదిగా తరలివచ్చిన కావలి ప్రజలు, జగనన్న స్థాయి ఏంటో చెప్పారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదల గుండెల్లో జగనన్న కొలువైవుండటం వల్లే ఈ జనసంద్రం కదిలి వచ్చిందని పిస్తోందని అభిప్రాయపడ్డారు. అణగారిన ప్రజలు, బీద బిక్కీ వారు తమ పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేకుండా ఇంటిదగ్గరే ఆ పనులు జరిగిపోతున్నాయని, గడప గడపచెంతకు ప్రభుత్వపాలన చేరిందని వివరించారు. బీసీలు, ఎస్సీ నాయకులను అవమానించి, మా మైనార్టీ పిల్లలను దేశద్రోహులని చెప్పి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పిన దుర్మార్గం చంద్రబాబుదని, కానీ మైనార్టీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలను కల్పించిన మంచితనం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదని ప్రశంసించారు.

కావలి నియోజకవర్గంలో సామాజిక సాధికారయాత్ర జైత్రయాత్రలా సాగింది. యాత్రకు వేలాదిగా జనం కదిలివచ్చారు. మధ్యాహ్నం ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో వివిధ రంగాల నిపుణులతో వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశమయ్యారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో మంత్రి డా. సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బీదమస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైయస్సార్‌సీపీ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్