Tuesday, June 9, 2026
Homeసినిమాఐదు దేశాల్లో షూటింగు జరుపుకోనున్న 'గూఢచారి 2' 

ఐదు దేశాల్లో షూటింగు జరుపుకోనున్న ‘గూఢచారి 2’ 

మొదటి నుంచి కూడా అడివి శేష్ డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. స్పై గా సాగే యాక్షన్ తరహా కథలను .. థ్రిల్లర్ జోనర్లోని కథలను సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ తరహా కథలను రెడీ చేసుకున్నవారు, ముందుగా అడివి శేష్ గురించే ఆలోచన చేసేలా తనని తాను మలచుకున్నాడు. గతంలో ఆయన చేసిన ‘గూఢచారి’ సినిమా హిట్ కావడంతో, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ గూఢచారి 2’ చేయనున్నాడు. ఈ సినిమాకి ‘G 2’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

ఈ సినిమాకి కథను అడివి శేష్ అందించడం విశేషం. వినయ్ కుమార్ అనే యువ దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన ‘ప్రీ విజన్ ఈవెంట్’ జరిగింది. ఈ వేడుకలో అడివి శేష్ మాట్లాడుతూ .. “వినయ్ కొత్త దర్శకుడే అయినా, కథాకథనాలపై .. టేకింగ్ పై ఆయనకి మంచి క్లారిటీ ఉంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని కాన్ఫిడెంట్ గా చెప్పగలడు” అన్నాడు.

” ఈ సినిమా కథా పరిధి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఐదు దేశాల్లో షూటింగు చేయవలసి ఉంటుంది. అంతకుముందుగా వినయ్ కోరినట్టుగా నేను సిక్స్ ప్యాక్ చేయవలసి ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమా పూర్తి కావడానికి ఏడాదిన్నర పట్టొచ్చు. 2024లో ఈ సినిమా థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది.  ‘గూఢచారి’ సినిమా సౌత్ ఇండియా స్థాయిలోనే ఆకట్టుకుంటుంది. ‘G 2’ మాత్రం ఆల్ ఇండియా స్థాయి ఫ్రాంచైజీగా మారుతుందని గర్వంగా చెప్పగలను” అంటూ ముగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular