ముంబై ఇండియన్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో 55 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. గుజరాత్ ఇచ్చిన 208 పరుగుల లక్ష్య సాధనలో ముంబై 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేసింది. ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (4) జట్టు స్కోరు 12 వద్ద ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా-13; విజయ్ శంకర్-19రన్స్ చేసి వెనుదిరిగారు. శుభ్ మన్ గిల్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 56; డేవిడ్ మిల్లర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46; అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42; రాహూట్ తెవాటియా 5 బంతుల్లో 3 సిక్సర్లతో 20… ధాటిగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2; అర్జున్ టెండూల్కర్, బెహెండ్రాఫ్, మెరెడిత్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (2); ఇషాన్ కిషన్ (13) మరోసారి విఫలమయ్యారు. నేహాల్ వధేరా-40; కామెరూన్ గ్రీన్-33; సూర్య కుమార్ యాదవ్-23; చావ్లా-18 పరుగులతో ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3; రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో 2; హార్దిక్ పాండ్యా ఒక వికెట్ సాధించారు.
అభినవ్ మనోహర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.