Sunday, January 19, 2025
HomeTrending Newsగుజరాత్, హిమాచల్ పై కన్నేసిన ఆప్

గుజరాత్, హిమాచల్ పై కన్నేసిన ఆప్

పంజాబ్ లో అధికారం కైవసం చేసుకున్న అమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై కన్నేసింది. పంజాబ్ లో విజయం సరిహద్దు రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ మీద ప్రబావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ హిమాచల్ లో బిజెపికి పోటీ ఇచ్చే స్థాయిలో కనిపించటం లేదు. అటు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదు కౌన్సిలర్ సీట్లు గెలుచుకున్న ఆప్ గుజరాత్ అసెంబ్లీలో పాగా వేయాలని ప్రణాలికలు సిద్దం చేస్తోంది. గుజరాత్ లో కాంగ్రెస్ నాయకత్వం రోజు రోజుకు బలహీనమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి తర్వాత గుజరాత్ కాంగ్రెస్ అనాథగా మారింది. పటిదార్ ఉద్యమకారుడు హర్దీక్ పటేల్ కు పిసిసి పగ్గాలు అప్పగించినా పటేల్ కుల ఓట్లు హస్తం వైపు మొగ్గటం లేదు. నరేంద్ర మోడీ హయం నుంచి గుజరాత్ లో ఎదురు లేకుండా సాగుతున్న బిజెపిని డీకొనే స్థాయిలో మరో పార్టీ ఓటర్లకు తారసపడటం లేదు. 22 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కమలనాథులు అప్రతిహతంగా గెలుస్తువస్తున్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్ లో బిజెపి మీద ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో కొల్లగొట్టాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ భావిస్తున్నారు. ఎల్లుండి పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయగానే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో ప్రచారం చేపట్టాలని, ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సిద్దం చేయాలని కేజ్రివాల్ ఆలోచన చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్