ఐపీఎల్ 16వ సీజన్ నేడు అట్టహాసంగా మొదలైంది. ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు కావాల్సిన దశలో గుజరాత్ బ్యాట్స్ మెన్ రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా చెలరేగి చెరో ఫోర్, చెరో సిక్సర్ కొట్టి మరో నాలుగు బంతులు మిలిగి ఉండగానే విజయం అందించారు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే కేవలం ఒకే పరుగు చేసి వెనుదిరగ్గా, రుతురాజ్ గైక్వాడ్ సత్తా చాటి 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు. మోయీన్-23; శివం దూబే-19, ధోని-14(నాటౌట్) పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది,.
గుజరాత్ బౌలర్లలో షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలా రెండు; జోషువా లిటిల్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత గుజరాత్ 37 పరుగులకు తొలి వికెట్ (వృద్దిమాన్ సాహా-25) కోల్పోయింది. శుభ్ మన్ గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63; విజయ్ శంకర్-27; సాయి సుదర్శన్-2; పరుగులు చేసి వెనుదిరగ్గా రషీద్ ఖాన్ మూడు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 10; తెవాటియా-15 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.
చెన్నై బౌలర్లలో రాజ్ వర్ధన్ హంగార్గేకర్ మూడు; తుషార్ దేశ్ పాండే, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
రషీద్ ఖాన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.