Saturday, March 29, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: లక్నోపై గుజరాత్ విజయం

ఐపీఎల్: లక్నోపై గుజరాత్ విజయం

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సైతం చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. రాహుల్ తెవాటియా 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40, అభినవ్ మనోహర్ 7 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గుజరాత్ ను గెలిపించారు. లక్నో విసిరిన 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 15 ఓవర్లకు 91 పరుగులు మాత్రమే చేయగలిగింది, అయితే 16వ ఓవర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతటియా చెరో సిక్సర్, చెరో ఫోర్ బాది మొత్తం 22 పరుగులు సాధించి మ్యాచ్ ను మలుపు తిప్పారు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పరుగుల ఖాతా తెరవకముందే షమీ బౌలింగ్ లో లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. డికాక్-7; లూయూస్-10; మనీష్ పాండే-6 కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆ తర్వాత దీపక్ హుడా-55; అయూష్ బదోనీ-54; క్రునాల్ పాండ్యా-21…రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. గుజరాత్ బౌలర్లలో షమీ మూడు, ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

గుజరాత్ కూడా నాలుగు పరుగులకే తొలి వికెట్ (శుభమన్ గిల్-డకౌట్) కోల్పోయింది, స్కోరు 15 వద్ద విజయ్ శంకర్(4) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా- మాథ్యూ వాడే లు మూడో వికెట్ కు 57 పరుగులు చేశారు. వాడే-30; హార్దిక్-33, డేవిడ్ మిల్లర్-30 పరుగులు చేసి ఔటయ్యారు.

మహమ్మద్ షమీ కి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

Also Read : ఐపీఎల్: బెంగుళూరుపై పంజాబ్ పంజా

RELATED ARTICLES

Most Popular

న్యూస్