GT -finalist: ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచింది. నేడు జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బట్లర్ 38బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లతో 68; పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులతో అజేయంగా నిలిచి గుజరాత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ లో జోస్ బట్లర్ 89(56బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు); కెప్టెన్ సంజూ శామ్సన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47; దేవదత్ పడిక్కల్ 20 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యష్ దయాళ్, హార్దిక్ పాండ్యా, సాయి కిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
పరుగుల ఖాతా ప్రారంభించక ముందే గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా డకౌట్ గా వెనుదిరిగాడు. శుభ మన్ గిల్-మాథ్యూ వాడే రెండో వికెట్ కు 72 పరుగులు జోడించాడు. గిల్ 21 బంతుల్లో 37; వాడే 30 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా- డేవిడ్ మిల్లర్ నాలుగో వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
రాజస్థాన్ బౌలర్లలోట్రెంట్ బౌల్ట్, మెక్ ఒబెద్ చెరో వికెట్ పడగొట్టారు.
డేవిడ్ మిల్లర్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది.