Thursday, March 28, 2024
Homeసినిమా'బెదురులంక 2012' షూటింగ్ పూర్తి

‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి నటిస్తోంది.  ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ అని ఓ వీడియో విడుదల చేశారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక – నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. ఇప్పుడు ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012’ వీడియోలో ఆ ఊరిని, అందులో మనుషులను పరిచయం చేశారు.

విశాలమైన గోదావరి తీరంలో పచ్చటి కొబ్బరి చెట్లు… మధ్యలో మనుషులు… బండి మీద దూసుకు వెళుతున్న కథానాయకుడు కార్తికేయ… ఊరు ఎలా ఉంటుందో వీడియో ప్రారంభంలో చూపించారు. కళ్ళకు కనిపించే విజువల్ కంటే చెవులకు వినబడే సంగీతం సెకన్లలో మైండ్‌కు ఎక్కేసేలా ఉంది. ”హొయ్ రబ్బోయ్… ఓరి నాయనా… ఇదేంట్రోయ్… ఈ మాయ” అని నేపథ్యంలో సాంగ్ వినిపిస్తుంటే… స్క్రీన్ మీద నిజంగా మాయ జరుగుతున్నట్లు ఉంటుంది. వెంటనే విజువల్‌తో కనెక్ట్ అవుతాం. సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి  మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, ‘ఆటో’ రామ్ ప్రసాద్ క్యారెక్టర్లనూ దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు.

చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ…. “మా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. సినిమా బాగా వస్తోంది. ప్రేక్షకులు అందరినీ నవ్వించే కొత్త తరహా చిత్రమిది. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ…. “కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ వీడియోలో చూశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అంత కంటే బావుంటాయి. మిగతా క్యారెక్టర్లు చేసే పనులు కూడా అంతే నవ్విస్తాయి. ప్రేక్షకుల నుంచి ఈ రోజు విడుదల చేసిన వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్, సినిమాను త్వరలో మీ ముందుకు తీసుకు రావాలని ఉంది” అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్