Sunday, January 19, 2025
HomeసినిమాGuntur Kaaram: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'గుంటూరు కారం'

Guntur Kaaram: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘గుంటూరు కారం’

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేయడం.. టీజర్ రిలీజ్ చేయడం తెలిసిందే. ఈమధ్య కాలంలో మహేష్ భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట.. ఇలా క్లాస్ మూవీసే చేశాడు కానీ.. ఒక్కడు, పోకిరి రేంజ్ లో ఉండే మాస్ మూవీ చేయలేదు. అభిమానులు మహేష్ నుంచి అలాంటి మాస్ మూవీని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కరెక్ట్ గా అలాంటి సినిమానే రెడీ చేస్తున్నారు.

గుంటూరు కారం టీజర్ లో మహేష్ లుక్, గెటప్, డైలాగ్.. చూసి ఇది కదా మాకు కావాల్సింది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ ను ఇలా రిలీజ్ చేశారో లేదో.. అలా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ట్విట్టర్ లో పంచుకున్న టైటిల్ పోస్టు కేవలం గంట వ్యవధిలో 50 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం గుంటూరు కారం టీజర్  10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేసింది. మహేష్‌, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు రావడం ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఇప్పుడు వస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ ని పక్కనపెట్టి మరీ.. గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. సినిమాలో మహేష్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంటాయి అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. వరుసగా విజయాలతో దూసుకెళుతున్న మహేష్ గుంటూరు కారంతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్